అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గన్ స్టాన్లీ తాజాగా భారత స్టాక్ మార్కెట్ల పురోగతి గురించి కీలక రిపోర్ట్ విడుదల చేసింది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్2026 డిసెంబర్ నాటికి లక్షా 7వేల పాయింట్లకు చేరుకోవచ్చని అంచనాలను ప్రకటించింది. అయితే ఇది బుల్ కేసులో మాత్రమే సాధ్యపడుతుందని పేర్కొంది. ఇలా జరగటానికి 30 శాతం వరకు అవకాశాలు ఉన్నాయని మోర్గన్ స్టాన్లీ అభిప్రాయపడింది.
మోర్గన్ స్టాన్లీ బుల్ సినారియోలో చమురు బ్యారెల్ ధర 65 డాలర్ల కంటే తక్కువగా ఉండాలని చెప్పింది. అలాగే గ్లోబల్ టారిఫ్స్ విధానంలో కూడా మార్పులు అవసరమని అప్పుడే దేశీయ అభివృద్ధికి పరిస్థితులు దోహదపడతాయని చెప్పింది. FY25 నుంచి FY28 వరకు సెన్సెక్స్ కంపెనీల లాభాలు సంవత్సరానికి సుమారు 19% వృద్ధి ఉండవచ్చని మోర్గన్ స్టాన్లీ భావిస్తోంది.
ఇక బేర్ సినారియోలో మార్కెట్ల పరిస్థితి ఇలా..
బేస్-కేస్ సంభవించే అవకాశాలు 50% ఉన్నాయని మోర్గన్ స్టాన్లీ పేర్కొంది. ఇదే జరిగితే రానున్న ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ సూచీ 95వేల పాయింట్లకు చేరుకుంటుందని పేర్కొంది. అయితే ఇది ప్రస్తుతం మార్కెట్లు ఉన్న స్థాయిలకు సుమారు 13% ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఇది మ్యాక్రో ఎకనామిక్ స్థిరత్వం, ఎక్స్‌పెన్స్ రేషియో, ప్రైవేట్ పెట్టుబడుల్లో పవర్, స్థిర గ్లోబల్ అభివృద్ధి, మృదువైన డొమెస్టిక్ మోనిటరీ పాలసీ వంటి వాటిపై ఆధారపడుతుంది.
►ALSO READ | రోజుకు 12 గంటలు.. 6 రోజులు పని చేస్తేనే బాగుపడతాం : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
భారతీయ ఈక్విటీ మార్కెట్ 2026 లో తన కోల్పోయిన ఇన్వెస్టర్ల ఆకర్షనను తిరిగి పొందొచ్చని మార్గన్ స్టాన్లీ విశ్లేషకులు రిధం దాసాయ్, నయంత్ పాలేఖ్ భావిస్తున్నారు. వారు తమ నివేదికలో రేటు రేట్ల తగ్గింపులు, లిక్విడిటీ పెంపు, GST రేట్ల తగ్గింపు వంటి భవిష్యత్ చర్యలు మార్కెట్ పెరుగుదలకు దోహదం చేస్తాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితులు ఇండియాను గ్లోబల్ ట్రేడ్ శక్తిగా మార్చుతాయని చెప్పారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్, ఫైనాన్షియల్స్, కస్టమర్ డిస్రెషనరీ, ఇండస్ట్రీయల్స్ వంటి రంగాల్లో అవుట్‌పర్ఫార్మెన్స్ ఉంగని మోర్గన్ స్టాన్లీ భావిస్తోంది.
ఈ కారణాల వల్లనే 2026 భారత మార్కెట్‌కి కీలక సంవత్సరం అవుతుంది అనే అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ సుమారు 84,800 వద్ద ఉండగా.. అంచనాలు సుమారు 27% వృద్ధిని ఆకాంక్షిస్తున్నారు.
