ట్రబుల్ షూటర్ కు విషమ పరీక్ష..హరీశ్ జిల్లాల బాట జూబ్లీహిల్స్ ఎఫెక్టేనా.?

ట్రబుల్ షూటర్ కు విషమ పరీక్ష..హరీశ్ జిల్లాల బాట జూబ్లీహిల్స్ ఎఫెక్టేనా.?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో గులాబీ పార్టీ డీలా పడిపోయింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు జిల్లాల బాట పట్టారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమి తర్వాత నైరా శ్యంలోకి వెళ్లిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు బయల్దేరారనే టాక్ ఉంది. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ కూడా అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ రజతోత్సవ సభ తర్వాత హరీశ్ రావు జిల్లాల పర్యటనకు బ్రేక్ పడింది. ఒక వేళ వెళ్లాల్సి వచ్చినా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. అనూహ్యంగా ఇవాళ బావాబావమర్ధులు ఇద్దరూ జిల్లాల పర్యటనకు వెళ్లడం కారు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

రజతోత్సవం తర్వాత సిద్దిపేటకే పరిమితం

 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీకి సైతం రెండు మూడు సార్లు మాత్రమే హాజరయ్యారు. ముఖ్యంగా ఫాంహౌస్ లోనే ఉంటున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనూ ఆయన ప్రచారం.. నిర్వహించలేదు. పార్టీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కీలకంగా వ్యవహరి స్తున్నారు, ఏప్రిల్ 27 న నిర్వహించిన బీజ ర్ఎస్ రజతోత్సవ సభ ఇన్ చార్జిగా మొదట హరీశ్ రావు పేరు ప్రకటించిన కేసీఆర్ తర్వాత పక్కన పెట్టేశారు. మిగతా నేతలందరినీ కేసీఆర్ తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత క్రమంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు.. తర్వాత సిద్దపేటకు పరిమితం చేశారు. తర్వాత కూడా ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లాల్సి వస్తే గులాబీ బాస్ కేసీఆర్ అనుమతి తీసుకో వాల్సిన పరిస్థితి ఉందని టాక్ ఉంది. 

►ALSO READ | కేటీఆర్ నాయకత్వం వల్లే బీఆర్ఎస్ పతనం: మంత్రి వివేక్ వెంకటస్వామి

జోష్ నింపేందుకే..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. పార్టీ కేడర్ నైరాశ్యంలోకి. వెళ్లిపోయింది. దీంతో జిల్లాల్లో పర్యటించాలని హరీశ్ రావును ఆదేశించినట్టు తెలుస్తోంది. క్రమంలోనే ఆయన ఇవాళ వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు గులాబీ సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు జిల్లాల బాట పట్టాల్సి వచ్చిందనేది బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.