42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు : ఆర్.కృష్ణయ్య

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు : ఆర్.కృష్ణయ్య
  •     ఆర్.కృష్ణయ్య వార్నింగ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెంటనే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు  ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో సంఘం జాతీయ వర్కింగ్  ప్రెసిడెంట్ డాక్టర్  ర్యాగ అరుణ్ కుమార్  అధ్యక్షతన 14 బీసీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. 

కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 45 శాతం రిజర్వేషన్లు పెంచకుండా పాత పద్ధతిలో 17 శాతానికి తగ్గించి ఎన్నికలకు పోతే పరిణామాలు వేరే ఉంటాయని హెచ్చరించారు. బీసీలను తక్కువ అంచనా వేయొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా 23న ఎన్నికల నోటిఫికేషన్  వేయాలని చూస్తున్నదని, దీనికి అభ్యంతరం తెలుపుతూ 20న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు దీక్షలు చేపడతామని తెలిపారు.