పీవీఎన్ఆర్-వేపై మూడో కన్ను !.. త్వరలో మల్టీవయలేషన్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు  

పీవీఎన్ఆర్-వేపై మూడో కన్ను !.. త్వరలో మల్టీవయలేషన్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు  
  • కెమెరాలు పెట్టి ఏఐతో మానిటరింగ్​
  • ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేస్తే దొరికిపోవుడే 
  • రూ.7.58 కోట్లతో ప్రాజెక్టు  

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలోని పీవీఎన్ఆర్​ఎక్స్​ప్రెస్​వేపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్​రూల్స్​పాటించేందుకు హెచ్ఎండీఏ కొత్త ప్లాన్​తో ముందుకు వచ్చింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్​ఎయిర్​పోర్ట్​వరకూ 14 కి.మీ. మేర ఉన్న ఫ్లైఓవర్​పై కొందరు ట్రాఫిక్​రూల్స్​బ్రేక్​చేస్తూ ప్రమాదాలకు కారణమవుతుండడంతో మల్టీవయలేషన్​డిటెక్షన్​సిస్టమ్(ఎండీఎస్) ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో భాగంగా ఫ్లైఓవర్​పై కెమెరాలు ఏర్పాటు చేసి ఏఐ ద్వారా వాహనాల స్పీడ్, స్లో మూవ్​మెంట్​, రాంగ్​వే, జిగ్​జాగ్​ డ్రైవింగ్, మొబైల్​ఫోన్​డ్రైవింగ్, రోడ్డు లేన్​రూల్స్​పాటించకపోవడం, సీట్​బెల్ట్​పెట్టుకోకపోవడం, రివర్స్​డైరెక్టర్, ఫాగ్​, స్మోక్​ వంటి వాటని మానిటర్​చేసి ఫొటోలు తీయనున్నారు.

5 నెలల్లో ప్రక్రియ పూర్తి

పీవీఎన్ఆర్ ​ఎక్స్​ప్రెస్​వేపై ఏర్పాటు చేసే ఎండీఎస్ కు దాదాపు 7.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టును ప్రైవేట్​ ఏజెన్సీకి అప్పగించి డిజైన్, కెమెరాల ఏర్పాటు, టెస్టింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్​వారే నిర్వహించేలా ప్రతిపాదనలు రూపొందించారు. వచ్చే 5 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి ఐదేండ్ల పాటు సదరు ఏజెన్సీనే మెయింటెయిన్​చేసేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇందులో ఉపయోగించే సింగిల్​5 ఎంపీ గ్లోబల్​షట్ట ర్​కెమెరాలు అన్ని రకాల ఫొటోలను క్లియర్​గా, 95 శాతానికి పైగా ఆక్యురెసీతో తీస్తుందన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్​చేసే వారు, రూల్స్​పాటించని వారిని సులభంగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.