- సీఎం కుర్చే లక్ష్యం: జాజుల
బషీర్బాగ్, వెలుగు: బీసీల్లో రాజకీయ విప్లవం మొదలైందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్పంచ్ ఎన్నికలతో పల్లెల్లో, మున్సిపల్ ఎన్నికలతో పట్టణాల్లో బీసీలు ప్రభంజనం సృష్టించారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సైఫాబాద్ లోని బీసీ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో 66 మంది మున్సిపల్ చైర్మన్లు , నలుగురు మేయర్లుగా బీసీలు ఎంపిక అయ్యారని తెలిపారు.
ఇది బీసీల చరిత్రాత్మక విజయమని చెప్పారు. 42 శాతం బీసీల రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో జనరల్ స్థానాల్లో ఓసీలతో పోటీపడి బీసీలు గెలుపొందరని వివరించారు. 2028లో సీఎం కుర్చే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
