కేటీఆర్ నాయకత్వం వల్లే తెలంగాణలో బీఆర్ఎస్ పతనమైతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ నాయకత్వంలో 2019 నుంచి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట మైసమ్మ గాంధారి వనంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టే ఓపెన్ జిమ్ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు మంత్రి. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమితో ఫెయిల్యూర్ లీడర్ గా కేటీఆర్ నిరూపించుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయంలో అవినీతి జరిగిందని కేటీఆర్ చెల్లెలు కవతనే చెబుతోందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా బీఆర్ఎస్ పార్టీకి 500 కోట్ల ఎలక్ట్రో బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజా సంపదను కొల్లగొట్టి లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు వివేక్.
అవినీతి రహిత చెన్నూరు లక్ష్యం
చెన్నూరు నియోజక వర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమన్నారు మంత్రి వివేక్. చెన్నూరు నియోజకవర్గంలో రూ. 600 కోట్లతో పలు అభివృధి పనులు జరుగుతున్నాయని...ఇంకా రెండు వందల కోట్ల పైపు లైన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందా,బియ్యం దందా,భూ మాఫియాను అరికట్టామన్నారు. అధికారులు నీతి నిజాయితీగా పని చెసే అధికారులకు మాత్రమే ఇక్కడ గుర్తింపు ఉంటదన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు వివేక్. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డ్,ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇయ్యలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేద ప్రజలకు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించామన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు కూడా 70 శాతం పూర్తయ్యాయని చెప్పారు వివేక్.
