చెన్నూరు, వెలుగు: చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్స్‌పై జిల్లా కాంగ్రెస్ కమిటీ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్స్ కారణంగా పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులు కొంతమంది ఓడిపోయారని పేర్కొన్నారు.
రెబల్స్ వల్ల పార్టీకి నష్టం వాటిల్లడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి రెబల్స్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలె వరూ రెబల్స్‌ని ప్రోత్సహించకూడదని, అలా చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు.
