టేకులపల్లి గ్రామ పంచాయతీ పరిధి లోని పత్తి కొనాలని రైతుల ఆందోళన

టేకులపల్లి గ్రామ పంచాయతీ పరిధి లోని పత్తి కొనాలని రైతుల ఆందోళన

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదినాథ్​ జిన్నింగ్​ మిల్లులో సీసీఐ అధికారులు తేమ, తాలు పేరిట కొర్రీలు పెడుతూ పత్తిని కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. మంగళవారం పలువురు ఆదినాథ్​మిల్లు ముందు ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. సీసీఐ 20వ తేదీ నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తుందని, ఇలాంటి సమయంలో ఇలా కొర్రీలు పెడుతూ కొనుగోళ్లు చేయకపోవడం సరికాదన్నారు.

కొనుగోలు గడువును పొడిగించాలని, రైతుల వద్ద నుంచి మొత్తం పత్తిని కొనుగోలు చేసి న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. సీసీఐ సిబ్బందిని వివరణ కోరగా నాణ్యమైన పత్తిని కొనుగోలు చేస్తామని తెలిపారు.