కోల్‌బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడ్డ మందమర్రికి చెందిన కాంగ్రెస్ లీడర్ జావిద్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.
మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జావిద్వద్దకు వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. రాళ్ల దాడిలో తలకు తీవ్ర గాయాలైన జావిద్ ప్రస్తుతం దవాఖానాలో చికిత్స పొందుతున్నారు.
