కార్పోరేట్ వర్కింగ్ కల్చర్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. ఎంప్లాయిస్ పైన బాస్ లు ఎలా వ్యవహరిస్తున్నారో.. ఎలా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారో చూడండి.. అంటూ తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి బాస్ లకు ఎలా బుద్ధి చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహం చూసి సెలవు ఇవ్వలేదని అనుకోకండి.. లీవ్ ఇచ్చినట్లే ఇచ్చి సున్నితంగా అతను చేసినపని నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
మార్నింగ్ సర్, రాత్రి మా తాత చనిపోయాడు, ఇవాళ ఆఫీస్ కు రాలేను.. అంటూ ఎంప్లాయి్ మెసేజ్ పంపాడు. ఎంప్లాయ్ మెసేజ్ కు సంఘీబావం ప్రకటించాడు మేనేజర్. మీ తాత మరణవార్త విని బాధపడుతున్నాను.. ఆఫ్ తీసుకో.. కానీ.. ఇవాళ క్లైంట్స్ తో ఆన్ బోర్డింగ్ ఉండాల్సి ఉంటుంది. కాల్ కు అందుబాటులో ఉంటావా..? వాట్సాప్ లో యాక్టివ్ గా ఉండు.. అవసరం అయినప్పుడు అటెండ్ కావాల్సి ఉంటుంది.. అంటూ రిప్లై ఇచ్చాడు.
ఈ కన్వర్జేషన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. ఈ స్టుపిడ్ ఏజెన్సీలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నాను. నా రోల్స్ చేంజ్ చేస్తున్నారు.. నా స్కోప్ కు సంబందం లేని వర్క్ ఇచ్చారు.. ఇలాగే చాలా మందిని తీసేవారు. ఫండ్స్ టైట్ ఉందని ఫైర్ చేశారు. నేను ఈ విషయంలో ఎప్పుడూ కంప్లైట్ చేయాలేదు.. నాకు ఇచ్చిన వర్క్ సిన్సియర్ గా చేస్తూ.. టీమ్ తో కంఫర్ట్ గా ఉంటున్నాను.కానీ ఇది దారుణం.. నేను ఒకరోజు లేకుంటే నా వర్క్ కేర్ ఆఫ్ ఎవరు..? మనం మనుషులం అన్న సంగతి మేనేజర్లు మరిచిపోతున్నారా.? రిజల్ట్స్ వేటలో మిషిన్లు నుకుంటున్నారా..? అంటూ ట్వీట్ చేశాడు ఆ ఎంప్లాయ్.
సోషల్ మీడియాలో దుమారం:
మేనేజర్ వ్యవహార శైలికి సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. తాత చనిపోయిన దుఖంలో ఉంటే ఎలా ఆన్ లైన్ లో.. ఉండగలం.. మీటింగ్స్ కు ఎలా అటెండ్ కాగలం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆఫ్ తీసుకోమని చెప్తూనే.. బట్.. అన్నారంటేనే ఇలాంటి తిరకాసు ఉంటుంది.. మేనేజర్స్ లీవ్స్ ఇచ్చినట్లే ఇచ్చి బట్.. అనే పదాన్ని వాడకపోతే మంచిది అంటూ కామెంట్ చేశారు.
బ్రో.. ఇది చాలా దారుణం.. వీలైతే మరో జాబ్ చూసుకో..రిజైన్ లెటర్ లో ఇదంతా ప్రస్తావించి సీఈఓ, మేనేజ్ మెంట్ కు కూడా పంపగలవు. ఏమైనా మార్పు వస్తుందేమో..అంటూ రిప్లై ఇచ్చారు.
ఒక సంస్థలో ఎక్స్ పీరియన్స్ కు విలువలేదు. ఎమోషన్స్ కు స్థానమే ఉండదు.. ఏం కార్పోరేట్ కల్చర్ రా బాబు.. అంటూ వైరల్ చేస్తున్నారు. కొందరేమో ఇది ఆధునిక బానిసత్వం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇండియా పరిస్థితి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. మా ఆఫీస్ లో కూడా మేనేజర్స్ ఇలాగే వ్యవహరించినట్లు రిప్లై ఇస్తు్న్నారు. నెటిజన్ల ఆగ్రహంతో వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది.
