హైదరాబాద్ లక్డీ కా పూల్లోని షా గౌస్ హోటల్ను క్లోజ్ చేసిన ఓనర్

హైదరాబాద్ లక్డీ కా పూల్లోని షా గౌస్ హోటల్ను క్లోజ్ చేసిన ఓనర్

హైదరాబాద్: హైదరాబాద్ లక్డీ కా పూల్లోని షా గౌస్ హోటల్ను ఆ హోటల్ యజమాని బంద్ చేశారు. పిస్తా హౌస్, షాగౌస్ హోటల్ యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న క్రమంలో హోటల్ను షా గౌస్ ఓనర్ మూసేశారు. పిస్తా హౌస్, షాగౌస్ హోటల్స్ ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రికార్డుల్లో చూపిన ఆదాయం నిజమైన ఆదాయం మధ్య తేడా ఉందని గుర్తించారు.

హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో పిస్తా హౌస్, షాగౌస్ హోటల్ యజమానుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరిగాయి. ట్యాక్స్ చెల్లింపులో ఐటీ అధికారులు వ్యత్యాసం గుర్తించారు. మొత్తం నాలుగు టీమ్స్గా ఏర్పడి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

పిస్తా హౌస్ వర్కర్లు ఉండే అపార్ట్ మెంట్లో కీలకమైన డాక్యుమెంట్స్ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్కి సంబంధించిన హార్డ్ డిస్కులు, కీలక పత్రాన్ని ఐటీ శాఖ సీజ్ చేసింది. వర్కర్ల నుంచి ఐటీ శాఖ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది.