పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం.. అది ఎలాగంటే..

పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం.. అది ఎలాగంటే..

 ఆన్​లైన్​  స్టోర్ల ద్వారా అమ్మకం
    డబ్ల్యూకామర్స్‌‌‌‌‌‌‌‌ సీఓఓ శ్రీధర్​ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :   పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేయవచ్చని డిజిటల్ కామర్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ డబ్ల్యూకామర్స్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ వంటి సాయంతో చిన్న వ్యాపారులు, వ్యక్తులు ఎవరైనా వ్యాపారం ప్రారంభించవచ్చు. సెల్లర్​ పేరుతో కంపెనీ ఒక ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. 

సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో ఈ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన లింక్‌‌‌‌‌‌‌‌/క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ను పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తేచాలు.  వాటిని ఎవరు కొన్నా సెల్లర్​కు 20-–40 శాతం లాభం వస్తుంది. డెలివరీ బాధ్యతలను కంపెనీ తీసుకుంటుంది. విక్రేతలు చేయాల్సిందల్లా తమ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడమే! ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 వేలకుపైగా  యాక్టివ్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ స్టోర్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయని డబ్ల్యూకామర్స్‌‌‌‌‌‌‌‌ కో–-ఫౌండర్‌‌‌‌‌‌‌‌, సీఓఓ శ్రీధర్‌‌‌‌‌‌‌‌ శ్రీరామనేని వెల్లడించారు. ‘హెల్త్‌‌‌‌‌‌‌‌, వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌, బ్యూటీ, పర్సనల్‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌, హోమ్‌‌‌‌‌‌‌‌ ఎసెన్షియల్స్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో ఎంపిక చేసిన 40కిపైగా బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి 600లకుపైగా ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చాం. 

ప్రతి బ్రాండ్‌‌‌‌‌‌‌‌కూ ఆయా విభాగాల్లో మార్కెట్లో మంచి పేరుంది.  కిరాణా వర్తకులు కూడా డబ్ల్యూకామర్స్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాంలో లభించే ఉత్పత్తులను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించవచ్చు.  ఓఎన్‌‌‌‌‌‌‌‌డీసీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లోనూ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుంది’ 
అని ఆయన వివరించారు.