హైదరాబాద్: 2015 గ్రూప్–2 నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి 2019లో టీజీపీఎస్సీ ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఓఎంఆర్ షీట్స్ రీవాల్యూయేషన్ చేసి, మళ్లీ సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్ లైన్ విధించింది హైకోర్టు.
గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2015లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016 నవంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి.. 2019లో గ్రూప్-2 నియమాకాలు చేపట్టింది టీజీపీఎస్సీ. అయితే.. 2015 గ్రూపు-2 ఓఎమ్‌ఆర్ షీట్ ట్యాంపరింగ్ జరిగిందని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు 2025, నవంబర్ 18న తుది తీర్పు వెలువరించింది.
2015 గ్రూప్-2 పరీక్షకు సంబంధించి 2019లో టీజీపీఎస్సీ ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేసింది. ఓఎమ్ఆర్ షీట్‌ను రీవాల్యూయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలని ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్ట్‌ను ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్‌లైన్ విధించింది హైకోర్టు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పరిధి దాటి వ్యవహరించిందని చురకలంటించింది.
వైట్నర్, దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాలను మూల్యంకనం చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓఎంఆర్ ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా జవాబు పత్రాలను మూల్యంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ఓఎమ్ఆర్ షీట్లను రీవాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్ట్ ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్ లైన్ విధించింది.
