
హైదరాబాద్ సిటీ/ పద్మారావునగర్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత టీచర్లను ఆదేశించారు. మంగళవారం సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. వివిధ సబ్జెక్టుల్లో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.
హెల్త్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ సర్కిళ్లలో ఉచిత హెల్త్ క్యాంపులు చేపట్టి వైద్య సేవలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. మంగళవారం బేగంపేటలోని పాటిగడ్డ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను ఆమె సందర్శించారు. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా శానిటేషన్ కార్మికులు 500 లకు పైగా వివిధ వైద్య పరీక్షలు చేయించుకొని వివిధ రకాల మందులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మహిళల కార్మికులు వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.