
హైదరాబాద్, వెలుగు: ప్రతి సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. పార్లమెంట్ఎన్నికలు ముగిసేవరకు వాయిదా వేస్తున్నట్లు కలెక్టరేట్వర్గాలు తెలిపాయి. శనివారం నుంచి ఎన్నికల కోడ్అమలులోకి రావడంతో... ప్రజావాణి రద్దుపై నిర్ణయం తీసుకున్నట్టు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.