పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్లతో సీపీ ఆనంద్ మీటింగ్

పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్లతో సీపీ ఆనంద్ మీటింగ్

హైదరాబాద్: పబ్స్, బార్స్,  డ్రైవ్–ఇన్ రెస్టారెంట్స్  యజమానులు మరియు డ్రైవ్-ఇన్ రెస్టారెంట్స్ యజమానులతో శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పబ్బులు, బార్లు, రెస్టారెంట్లల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎక్కువ సౌండ్ పెట్టి స్థానికులకు ఇబ్బంది కలిగించొద్దని, తాగి వెళ్లేవారికి అవసరమైతే క్యాబ్ సర్వీస్ కల్పించాలని సూచించారు. 30 రోజుల బ్యాకప్ కెపాసిటీ కల్గిన సీసీ కెమెరాలు, సౌండ్ ప్రూఫింగ్, వ్యాలెట్ డ్రైవర్లను ఏర్పాటు చేయాలని కోరారు. 24 గంటల లిక్కర్ సౌకర్యం ఉన్న స్టార్ హోటళ్లు... పరిమిత సమయం దాటాక  విదేశీయులను మాత్రమే అనుమతించాలని చెప్పారు. నగరంలో దేశ, విదేశాల నుంచి పెట్టబడులు వస్తున్నాయన్న ఆయన... శాంతి భద్రతలు, మహిళా సంరక్షణ, వేగవంతమైన క్లియరెన్స్, ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలు దేశ, విదేశాల పెట్టబడిదారులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.

పబ్బు సమయానికి పది నిమిషాల ముందే లైట్లను డిమ్ చేయాలని, దీంతో కస్టమర్లు పబ్బు మూసివేసే టైం అయిందని అర్థం చేసుకుంటారని స్పష్టం చేశారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి నగరానికి అంతర్జాతీయంగా మంచి పేరు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ సీపీ (క్రైమ్స్ & సిట్) శ్రీ ఏ.ఆర్.శ్రీనివాస్, జాయింట్ సీపీ (అడ్మిన్)  ఎం.రమేశ్, జాయింట్ సీపీ (ఎస్బీ) పీ.విశ్వప్రసాద్,  5 జోన్లకు చెందిన డిసీపీలు,  ఇతర పోలీసు అధికారులు, పబ్ ఓనర్లు తదితరులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తల కోసం...

ట్విట్టర్ డీల్‌ తాత్కాలికంగా నిలిపివేత..

ఫ్లైట్ క్యాబిన్ డోర్ను కాలితో మూసింది