ఫ్లైట్ క్యాబిన్ డోర్ను కాలితో మూసింది

V6 Velugu Posted on May 13, 2022

తనకంటే ఎత్తులో ఉన్న ఫ్లైట్ క్యాబిన్ డోర్ ను కాలితో మూసి అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది ఓ మహిళ. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.... ఓ మహిళ ఫ్లైట్ లో ప్రయాణిస్తోంది. ఇంతలో ఆ ఫ్లైట్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. దీంతో ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కొక్కరుగా దిగిపోయారు. ఇక ఆ ఫ్లైట్ లో ఆమె ఒక్కతే మిగిలింది. తను కూడా ఫ్లైట్ దిగడానికి సిద్ధమైంది. అందుకోసం ఫ్లైట్ క్యాబిన్ లో నుంచి తన సామాను తీసుకుంది. ఓ చేతిలో బేబీ, మరో చేతిలో లగేజీతో ఉన్న ఆ మహిళ... తనకంటే ఎత్తులో ఉన్న క్యాబిన్ డోర్ ను తన కుడి కాలితో మూసేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఫిగెన్ అనే యువతి ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఓ జిమ్నాస్ట్ లా ఆ మహిళ  చేసిన ఈ ఫీట్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్, 7 వేల వరకు లైక్స్ వచ్చాయి. సూపర్, ఎక్సలెంట్, ఇంప్రెస్సివ్ అంటూ నెటిజన్లు ఆమెను తెగ పొగిడేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

విభజన హామీలతో తెలంగాణకు రండి..

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు

Tagged woman, Social media, Baby, Close, luggage, flight, cabin door

Latest Videos

Subscribe Now

More News