ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు

సిద్ధిపేట: ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హారీశ్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రంలో సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమ‌న్నారు. ములుగు అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్న మంత్రి... ఇవాళ దేశంలోని అన్ని ప్రాంతాలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాయని చెప్పారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి ఎన్నో కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఎకరాకు రూ.10 లక్షలుంటే ఇవాళ రూ. 4 కోట్లకు చేరిందన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రులు, బడుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.            

మరిన్ని వార్తల కోసం...

 

పశ్చిమబెంగాల్ : గ్రామంలో గజరాజు హల్ చల్

నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదాకు సుప్రీంకోర్టు నో