ట్విట్టర్ డీల్‌ తాత్కాలికంగా నిలిపివేత..

ట్విట్టర్ డీల్‌ తాత్కాలికంగా నిలిపివేత..

ప్రముఖ బిలీనియర్, టెస్లా చీఫ్ ఎలన్‌ మస్క్‌ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ట్విట్టర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. ఇదే విషయంపై తన ట్విట్టర్ అకౌంట్‌లోనే ఓ పోస్ట్‌ చేశారు.

సుమారు 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్, ఎలన్‌ మస్క్‌ మధ్య కొనుగోలు ఒప్పందం జరిగింది. మరో ఆరు నెలల్లో పూర్తిగా ఎలన్‌ మస్క్‌ చేతికి ట్విట్టర్ వెళ్లాల్సి ఉంది. ఈలోపే ట్విట్టర్ డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్‌ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టామని చెప్పారు. 

ఎలన్ మస్క్ ప్రకటనతో మార్కెట్‌ ట్రేడింగ్‌లో ట్విటర్‌ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు ఈ డీల్‌ నిలిపివేతపై ట్విటర్‌ ఇంకా స్పందించలేదు.

మరిన్ని వార్తల కోసం..

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు అరెస్ట్

మద్యం మత్తులో యువకుల వీరంగం