ఐబొమ్మ రవి అరెస్ట్ తో డేటా చోరీపై విస్తృతంగా చర్చ జరుగుతోంది..పైరసీ సినిమాల చాటున భారీగా డేటా చోరీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో డేటా చోరీపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ అంగట్లో డేటాకు విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు. పైరసీ సైట్లు, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లోనే డేటా చోరీ ఎక్కువగా ఉందని అన్నారు సజ్జనార్.
డిమాండ్ ను కాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు పలు మార్గాల్లో మన డేటాను చోరీ చేసి.. నెట్టింట చీకటి ప్రరపంచమైన డార్క్ వెబ్ లో అమ్మేస్తున్నారని అన్నారు సజ్జనార్.సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిన డేటా డేటా ఎక్కడికి చేరుతుందో, ఎవరి చేతుల్లోకి పడుతుందో మనకు తెలీదని అన్నారు.
సినిమా పైరసీ సైట్లు, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారంలలోనే ఎక్కువగా డేటా చోరీ కి గురవుతోందని... ఉచిత సినిమాలు, ఉచిత గేమ్స్, బోనస్‌లు.. ఇవన్నీ కేవలం డేటాను దోచుకునేందుకు వేసిన ఉచ్చులేనని అన్నారు సజ్జనార్.
ఈ ఉచ్చుల్లో చిక్కుకుంటే మనకు తెలియకుండా మాల్వేర్ ద్వారా మొబైళ్ల నుంచి ఫోటోలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు అన్ని తస్కరణకు గురవుతాయని అన్నారు సజ్జనార్. డేటా చోరీ పట్ల అవగాహన పెంచుకొని.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు సజ్జనార్.
