న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా నగర వాసులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడితే జైల్లో వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రై నడుస్తోందని చెప్పారు. జనవరి 1వ తేదీ వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రై నిర్వహిస్తామన్నారు. న్యూ ఇయర్ రోజు ఫ్యామిలీతో ఉంటారా లేక డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి జైల్లో ఉంటారా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని సూచించారు. డేంజరస్, డ్రైవింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ ఎవ్వరు ప్రోత్సహించకూడదని సూచించారు.
2025 సంవత్సరంలో ఇప్పటికి 5,818 డేంజరస్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశామని తెలిపారు. భద్రత స్వేచ్ఛ కోసం హైద్రాబాద్ సిటీ పోలీస్ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. టెక్నాలజీని మరింత ఉపయోగించి నేరాలను తగ్గించే విధంగా పని చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం కోసం ఒక లక్ష్యం పెట్టుకుని AI డ్రివెన్ పోలీసింగ్ లో ముందుకు వెళ్తామన్నారు. సైబర్ క్రైమ్, అండ్ డిజిటల్ మిషన్ లో భాగంగా సైబర్ విక్టిమ్స్ కోసం సులభంగ కేసు నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు సీపీ సజ్జనార్. 11 షీ టీమ్స్ టీం లను ఇంకా ముందుకు తీసుకెళ్తామన్నారు. బాధిత మహిళలకు భోరస కల్పిస్తామన్నారు.
సోషల్ మీడియా పై పిల్లలకు తల్లితండ్రులు అవగాహన కల్పించాలని సూచించారు సజ్జనార్. సోషల్ మీడియాలో ఏర్పడిన ప్రతి పరిచయం నిజం కాదన్నారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం హైద్రాబాద్ సిటీ పోలీస్ పాటు పడుతుందన్నారు. గత సంవత్సరం 322 కేసులు నమోదు అయితే ఈ సారి 368 కేసులు నమోదు చేశామన్నారు. రూ.6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామన్నారు సీపీ. ఇంటలిజెన్స్ నెట్ వర్క్ ను పెంచి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. గత సంవత్సరం 484 రేప్ కేసులు నమోదైతే ఈ సారి 405 నమోదు చేశామని చెప్పారు.
