చార్మినార్, వెలుగు: ఆటో కిరాయి చిల్లర డబ్బుల విషయంలో జరిగిన గొడవలో ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వట్టేపల్లికి చెందిన యూట్యూబర్ అజీమ్ తల్లి ఆదివారం ఒంటరిగా మైలార్‌దేవ్‌పల్లికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆమె ఓ ఆటో ఎక్కింది.
వట్టేపల్లికి రూ.100 కిరాయి మాట్లాడుకోగా, తన వద్ద రూ.200 నోటు ఉందని ఆటో డ్రైవర్ ముఖరంకు తెలిపింది. చిల్లర విషయంలో ఇద్దరి మధ్య ఆటోలోనే వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన కొడుకు అజీమ్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అజీమ్ మరో ఇద్దరితో కలిసి ఆటో కోసం వట్టేపల్లిలో ఎదురుచూశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డ్రైవర్ ముఖరంపై ముగ్గురు కలిసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ముఖరం అక్కడికక్కడే మృతిచెందినట్లు ఫలక్‌నుమా సీఐ అప్పలనాయుడు తెలిపారు.
