శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీ నగదు పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వ‌చ్చిన ఓ మ‌హిళ వ‌ద్ద నుంచి రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా-952 విమానంలో వ‌చ్చిన ఆమె లగేజ్ లో ఐదు గోల్డ్ బార్స్, 22 క్యార‌ట్ బంగారు న‌గ‌ల‌ను గుర్తించారు. వాటి మొత్తం విలువ రూ.96 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచనా వేశారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.