పద్మారావునగర్,వెలుగు: క్రెడిట్‌కార్డు ఇప్పిస్తామంటూ ఓ మహిళనూ బురిడీ కొట్టించాడో సైబర్‌క్రిమినల్. ఏపీకే ఫైల్పంపించి రూ.1,29,998 కాజేశారు. రాంగోపాల్‌పేట్ పరిధిలో సింధీ కాలనీకి చెందిన అంజలి మట్టా (57)కు ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేశాడు. తాను హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు క్రెడిట్ కార్డు ప్రతినిధిని అంటూ కార్డు తీసుకోవాలని కోరాడు. అవసరం లేదని చెప్పినా మాటల్లో పెట్టి కొద్దిసేపటికి పెట్టేశాడు.
కొద్దిసేపటికి ఆమె కాల్స్ మరో నంబర్‌కు ఫార్వర్డ్ అయినట్లు మేసేజ్ రావడంతో పాటు, ఎస్‌ఎంఎస్ సర్వీస్ నిలిచిపోయింది. క్రెడిట్‌కార్డు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించింది. అప్పటికే ఆమె ఫోన్లో హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌కార్డు పేరుతో ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ అయ్యింది. తర్వాత ఆమె ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కొద్దిసేపటికే జెప్టోకు రూ.89,998, ఫేస్‌బుక్‌కు రూ.40,000 చొప్పున రూ.1,29,998 నగదు బదిలీ అయినట్లు తేలింది.
