హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-–27 విద్యా సంవత్సరానికి ఫీజులో 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని డీఈవో యాదయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని జర్నలిస్ట్సంఘాలు వినతిపత్రం ఇవ్వగా, ఆయన సర్క్యులర్ఇచ్చారు.
ఫీజు మినహాయింపు పొందాలంటే గుర్తింపు పొందిన జర్నలిస్ట్ యూనియన్ ,అసోసియేషన్ జారీ చేసిన చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) లేదా మెంబర్షిప్ సర్టిఫికెట్ను స్కూల్ యాజమాన్యాలకు సమర్పించి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ ఈ రూల్ను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డీఈవో ఆదేశించారు.
