
హైదరాబాద్ : రిపబ్లిక్ డే, ఇండిపెండెంట్ డేలకు జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని చాటుతాం. ఇటీవల సినిమా థియేటర్స్ లోనూ జాతీయగీతం పాడటం తెలుసు. అయితే బార్ లో జాతీయగీతం పాడారు మందుబాబులు. భక్తికి ప్లేస్ తో సంబంధంలేదని నిరూపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన భారత్- పాక్ మ్యాచ్‌లో కోహ్లేసేన 89 రన్స్ తేడాతో గ్రేట్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాడిన జాతీయగీతానికి హైదరాబాద్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మందుబాబులు లేచి నిలబడి దేశభక్తిని చాటుకున్నారు.
మ్యాచ్ ప్రారంభానికి ముంము ఆయా టీమ్స్ జాతీయ గీతాన్ని పాడటం కామన్. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న వాళ్లు లేచి నిలబడి ఆటగాళ్లతో పాటు గీతాన్ని ఆలపిస్తారు. టీవీల ముందు ఉన్న వారు కూడా నిలబడి తమ దేశభక్తిని చాటుకుంటుంటారు. పాకిస్థాన్‌తో మొన్న జరిగిన మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో మందు తాగడానికి వచ్చిన వారు అక్కడి టీవీలో జాతీయ గీతం వస్తుండగా లేచి నిలబడ్డారు. ఒకరిని చూసి ఒకరు అందరూ నిలబడి జాతీయగీతం పాడారు. జాతీయగీతం అయిపోయాక భారత్ మాతాకి జై అనడంతో బార్ లో ఒక్కసారిగా కేకలు వినబడ్డాయి. దీంతో దేశభక్తికి సమయం, సందర్భం, స్థలం లాంటి విషయాలతో సంబంధం లేదని నిరూపించారు మందుబాబులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.