
హైదరాబాద్‌సిటీ, వెలుగు: బిల్డింగ్ పాతది కావడం, అందులోని వైరింగ్కూడా పాతది కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని ఫైర్ సేఫ్టీ సిబ్బంది అనుమానిస్తున్నారు. బిల్డింగ్ ఫస్ట్‌ఫ్లోర్‌లోని హాల్, రెండు కిచెన్లలో ఏసీలు ఉండగా అక్కడికి వచ్చినవాళ్లు ఏసీలు వేసుకుని పడుకున్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఓ రూమ్‌లో పాత వైరింగ్కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ బిల్డింగ్‌ను కొంతకాలం కింద రిన్నోవేషన్చేసినట్టు చెప్తున్నా.. గోడల లోపల ఉన్న వైరింగ్మార్చడంపై దృష్టి పెట్టలేదని తెలుస్తున్నది.
షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఏసీ కంప్రెషర్లపై ఒత్తిడి పెరిగి పేలి ఉంటాయని, దానికి తోడు ఇంట్లోని మొత్తం వైరింగ్ ద్వారా మంటలు నిమిషాల వ్యవధిలో ఫ్లోర్అంతటికీ వ్యాపించి ఉంటాయిన ఫైర్‌సేఫ్టీ అధికారులు అనుమానిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు ఏసీల్లో అవసరమైనంత ఆయిల్ లేకపోవడం వల్ల కూడా షార్ట్సర్క్యూట్జరుగుతుందని, నైట్రోజన్ ప్రెషర్చెక్చేసిన తర్వాత అందులోని కేబుల్తీయకపోయినా షార్ట్సర్క్యూట్జరిగే ప్రమాదం ఉంటుందని ఏసీ ఎలక్ట్రీషియన్లు అంటున్నారు.