మెడికల్ కాలేజీకి బూర్గుల సుమన డెడ్ బాడి

మెడికల్  కాలేజీకి  బూర్గుల సుమన డెడ్ బాడి

పద్మారావునగర్​,వెలుగు: హైదరాబాద్‌‌‌‌ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వెంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన(88) వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ నెల 21న మృతిచెందారు. ఆమె డెడ్​బాడీని కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌‌‌‌ గాంధీ మెడికల్‌‌‌‌ కాలేజీకి బుధవారం అప్పగించారు. 

స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు సోదరి అయిన సుమన హైదరాబాద్‌‌‌‌లోని ఆటమిక్‌‌‌‌ ఎనర్జీ సెంట్రల్‌‌‌‌ స్కూల్​లో టీచర్‌‌‌‌గా విధులు నిర్వహించి రిటైర్డ్​ అయ్యారు. 2011 నుంచి 2021 వరకు రంగారెడ్డి జిల్లా షాద్‌‌‌‌నగర్‌‌‌‌ ఫరూఖ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం బూర్గుల సర్పంచ్‌‌‌‌గా, ఎంపీటీసీగా పనిచేశారు. ప్రగతి వెల్ఫేర్‌‌‌‌ అసోషియేషన్‌‌‌‌ను ఏర్పాటు చేసి పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. మరణాంతరం తన డెడ్​బాడీని గాంధీ మెడికల్‌‌‌‌ కాలేజీకి అప్పగించాలని వీలునామా రాశారు.