సిటీలో గణేశుడి రాకను కూడా సంబురంగా జరుపుకుంటున్నారు. ఇంతకుముందు డప్పు చప్పుళ్ల మధ్య మండపాలకు తీసుకువచ్చేవారు. ఇప్పుడు మిరుమిట్లు గొలిపే కలర్ఫుల్లైటింగ్ ఏర్పాటు చేసి, హారతులు పట్టుకున్న ఆడపడుచులతో, డీజే పాటలు, డ్యాన్స్హంగామా మధ్య గణనాథుడిని తీసుకొస్తున్నారు.
.నిమజ్జనానికి ధీటుగా ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆగమన్సెలబ్రేషన్స్ చేస్తున్నారు. చవితికి వారం ముందు నుంచే మొదలైన ‘ఆగమన్ఉత్సవ్’ శుక్రవారం వరకు కొనసాగింది. మిగిలిన వారు శనివారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. వీటికి సంబంధించి మండపాల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
- వెలుగు, హైదరాబాద్ సిటీ