చిక్కడ పల్లిలో బంగారు వ్యాపారి అదృశ్యం

చిక్కడ పల్లిలో బంగారు వ్యాపారి అదృశ్యం
  •     కిడ్నాప్​ కోణంలోనూ దర్యాప్తు  

ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లిలో బంగారం వ్యాపారి శ్రీనివాసరావు అదృశ్యమయ్యారు. సోమవారం ఉదయం చిక్కడపల్లి లోని తన ఇంటి నుంచి రామంతపూర్‌‌లోని జ్యువెల్లరీ షాపుకు వెళ్లిన శ్రీనివాసరావు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మూడు స్పెషల్​టీమ్స్​ను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. 

ఇంటి నుంచి షాపు వరకు ఆయన వెళ్లిన రూట్​లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్‌‌రావు అదృశ్యమయ్యారా.. లేక ఎవరైనా కిడ్నాప్‌‌చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.