హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం..గత ఏడాదితో పోలిస్తే ఈసారి 35 శాతం వృద్ధితో 8,344 ఇళ్లు రిజిస్టర్ అయ్యాయి. వీటి మొత్తం విలువ రూ. 5,887 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల ఐదో తేదీ నుంచి మార్కెట్ విలువలను పెంచడంతో చాలామంది మే నెలలోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు.
రూ. కోటికి పైగా విలువైన ఇండ్లు మొత్తం మార్కెట్ ఆదాయంలో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి. రూ. 50 లక్షల లోపు ఇళ్లు వాటా 54 శాతం ఉంది. రంగారెడ్డి జిల్లా 50 శాతం రిజిస్ట్రేషన్లతో మొదటిస్థానంలో నిలవగా, మేడ్చల్ మల్కాజిగిరి 37 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది.
