నాంపల్లిలో హైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కింగ్.. ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నాంపల్లిలో హైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కింగ్.. ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఇట్లాంటి పార్కింగ్ ఢిల్లీలో కూడా లేదు 
  •     దేశంలోనే ఫస్ట్ టైమ్ ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం
  •     ఇలాంటివి సిటీలో మరిన్నిచోట్ల నిర్మిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశంలోనే ఫస్ట్​టైమ్​ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన పార్కింగ్​సదుపాయం అందుబాటులోకి వచ్చింది. నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్​ (పీపీపీ) పద్ధతిలో నోవమ్ సంస్థ నిర్మించిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ సిటీ శరవేగంగా విస్తరిస్తున్నది. ట్రాఫిక్ కూడా అదే రేంజ్​లో పెరుగుతున్నది. 

ఈ రద్దీకి చెక్ పెట్టేందుకే హైటెక్ హంగులతో పార్కింగ్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా విదేశీ టెక్నాలజీని వాడి నాంపల్లిలో మల్టీ లెవల్ పార్కింగ్ (ఎంఎల్సీపీ) కట్టాం. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో కూడా పార్కింగ్ ఉంది కానీ.. ఇంత లేటెస్ట్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, టెక్నాలజీ అక్కడ కూడా లేదు’’ అని  పేర్కొన్నారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నేతృత్వంలో సిటీలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

నాంపల్లి జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీసులు, వ్యాపార సముదాయాలు ఎక్కువ కాబట్టి ఇక్కడ రద్దీ బాగా ఉంటుందని చెప్పారు. అందుకే మెట్రో స్థలంలో 15 అంతస్తులతో ఈ కాంప్లెక్స్ కట్టామన్నారు. ఇందులో 10 అంతస్తులు పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, 5 అంతస్తులు కమర్షియల్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించినట్టు చెప్పారు. ఒకేసారి 200 కార్లు, 200కు పైగా బైకులు పార్క్ చేసుకోవచ్చని, పైనుంచి చూస్తే సిటీ కనిపించేలా మంచి వ్యూ పాయింట్ కూడా ఉందని వివరించారు. భవిష్యత్తులో మిగతా ప్రాంతాల్లోనూ ఇలాంటివి కడతామన్నారు. 

పార్కింగ్ సదుపాయాన్ని జనం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అజారుద్దీన్ సూచించారు. పీపీపీ ప్రాజెక్టుల వల్ల జనానికి సౌకర్యం, ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందని  అభిప్రాయపడ్డారు. కాంప్లెక్స్ లోని థియేటర్ స్క్రీన్లు, ఇతర సౌకర్యాలను లీడర్లు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, అర్బన్ ట్రాన్స్ పోర్ట్ అడ్వైజర్ ఎన్వీఎస్ రెడ్డి, కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, నోవమ్ ఎండీ హరికృష్ణారెడ్డి, భావనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ బడ్జెట్​లోనైనా కేంద్రం న్యాయం చేయాలి: పొన్నం

కేంద్రం ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్​లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పౌర్ణమి రోజున ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు వెలుగులు నింపుతుందా.. చీకటిని మిగిల్చుతుందా.. అనేది చూడాలని అన్నారు. గత 11 కేంద్ర బడ్జెట్లలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని, కనీసం ఈ బడ్జెట్లోనైనా రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఈసారి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు బాధ్యతవహించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి, హైదరాబాద్ కు చేసిందేంటని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి పెద్ద మొత్తంలో చేరుతున్నా.. ఫెడరల్ పద్ధతిలో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు ఇవ్వకుండా కేంద్రం పూర్తి వివక్ష చూపుతోందని విమర్శించారు. 

కేంద్ర బడ్జెట్ లో ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పెండింగ్ ప్రాజెక్టులకు, ఇప్పుడు కొనసాగుతున్న ప్రాజెక్టులకు కూడా ఈ బడ్జెట్ లో కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసేలా బడ్జెట్ లో నిధులను కేటాయించాలని, ట్రిపుల్ ఆర్ కు, ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్ రోడ్డుకు, మెట్రో రెండో దశ,  ఎయిర్ పోర్టుల అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని  కోరారు.