భారత్‌‌‌‌లో తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌‌‌‌గా కేఎల్‌‌‌‌హెచ్ వర్సిటీ

భారత్‌‌‌‌లో తొలి ఏజెంటిక్  ఏఐ క్యాంపస్‌‌‌‌గా కేఎల్‌‌‌‌హెచ్ వర్సిటీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని బాచుపల్లిలో ఉన్న కేఎల్‌‌‌‌హెచ్ యూనివర్సిటీ ఏఐ ఆధారిత విద్యలో మరో చారిత్రక మైలురాయిని సాధించింది. సోమవారం హెచ్‌‌‌‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ‘ఏజెంటిక్ ఏఐ క్యాంపస్’ ను ప్రారంభించింది. 

కొనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కొనేరు సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కొనేరు లక్ష్మణ్ హవీష్, వీసీ  పార్థసారధి వర్మల నాయకత్వంలో సాంకేతిక విద్యను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని హెచ్‌‌‌‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్ నేషనల్ హెడ్ శ్రీ దీపక్ సర్వనన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎల్‌‌‌‌హెచ్ వర్సిటీ, హెచ్‌‌‌‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం కోనేరు సత్యనారాయణ మాట్లాడారు. 

ఉత్పత్తి ఆధారిత అభ్యాసం, ఇండస్ట్రీ అసైన్‌‌‌‌మెంట్లు,  ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంతో విద్యార్థులను భావి నిపుణులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.  సాంకేతిక నైపుణ్యాలతో పాటు డేటా గోప్యత, పక్షపాతం, పారదర్శకత, నైతిక విలువలతో కూడిన బాధ్యతాయుతమైన ఏఐ వినియోగంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.