నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మే 17న నాంపల్లిలో మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మే 17న నాంపల్లిలో మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఇదొక మంచి అవకాశం.  హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా జరగబోతుంది.  మే 17వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి  మధ్యాహ్నం 1 గంట వరకు నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది.  ఆసక్తిగల నిరుద్యోగులెవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ జాబ్ మేళాలోచాలా కంపెనీలు పాల్గొననున్నాయి.  ఫార్మా, ఆరోగ్యం, ఐటీ & ఐటీఈఎస్ సంస్థలు, విద్య, బ్యాంకులు  ఇతర రంగాలలో పలు  హోదాల్లో ఉద్యోగాలను ఆఫర్ చేయనున్నాయి.  కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం  అవకాశాన్ని కూడా అందిస్తాయి.

అభ్యర్థుల అర్హత SSC కంటే ఎక్కువగా ఉండాలి,  ప్రాథమిక ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ జాబ్ మేళాకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు.  ఆసక్తిగల నిరుద్యోగులు మరిన్ని వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.