
హైదరాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్ అంటీ సంస్థ (L&T) తప్పుకుంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో మెట్రో నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోనుంది. గురువారం (సెప్టెంబర్ 27) సీఎం రేవంత్ రెడ్డి, L&T గ్రూప్ చైర్మన్ జరిగిన చర్చలు ఫలించాయి. మెట్రే స్టేజ్ 1 ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ అంగీకరించారు.
ఒప్పందంలో భాగంగా ఎల్ అండ్ టీకి ఉన్న సుమారు రూ.13 కోట్ల అప్పును టేకోవర్ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదే విధంగా ఎల్ అండ్ టీ సంస్థ ఈక్విటీ పెట్టుబడికి బదులుగా దాదాపు రూ.2 వేల100 కోట్లు ఒకేసారి చెల్లించనుంది ప్రభుత్వం.
గురువారం సీఎం రేవంత్ ను కలిసిన ఎల్ అండ్ టీ గ్రూప్ సీఎండీ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఫేజ్-1, ఫేజ్-2ల మధ్య ఏకీకరణపై ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యం కాదని తెలిపారు. ట్రాన్స్పోర్టేషన్ ఓనర్షిప్ నుంచి తమ సంస్థ తప్పుకున్నందున ఫేజ్ 2 విస్తరణలో పార్టిసిపేట్ చేయలేమని తెలిపారు. అయితే ప్రత్యామ్నాయంగా, ఫేజ్-1లో తమ వాటా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధమని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఫేజ్-2ఏ అండ్ 2బీలో 163 కి.మీ. కొత్త మెట్రో లైన్లు ప్రతిపాదించింది. ఫేజ్-2 అప్రూవల్ కోసం ఎల్ అండ్ టీ తో డిఫినిటివ్ అగ్రిమెంట్ సంతకాన్ని కేంద్రం కోరింది. ఎల్ అండ్ టీ.. ఫేజ్-2లో ఈక్విటీ పార్టనర్‌గా పాల్గొనలేమని స్పష్టం చేసింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా సెంటర్ కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి – ఫేజ్-1, ఫేజ్-2 ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ కోసం సంస్థకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం – ఫేజ్-1 ప్రాజెక్ట్ మొత్తం టేకోవర్ చేయాలని ప్రతిపాదించింది. ఫేజ్-1 ప్రాజెక్ట్ అప్పు రూ.13 వేల కోట్లు రాష్ట్రం భరిస్తుందని అంగీకారం తెలిపింది. ఈక్విటీ విలువ రూ.2 వేల కోట్లను ఎల్ అండ్ టీకి చెల్లింపునకు ప్రతిపాదించింది. ఈ టేకోవర్ షరతులు పరస్పర చర్చలతో ఒక కొలిక్కి రానున్నాయి.