హైదరాబాద్: అమీర్ పేట్ KSR ఫ్యాషన్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న మెట్రో పిల్లర్ క్రాక్ వచ్చిందనే వార్తలను హైదరాబాద్ మెట్రో అధికారులు ఖండించారు. ప్రమాద స్థలానికి పిల్లర్ దగ్గరగా ఉందని, అందుకే ముందు జాగ్రత్తగా మెట్రో పిల్లర్‌ను చెక్ చేశామని.. మెట్రో పిల్లర్కు ఎలాంటి డ్యామేజీ జరగలేదని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.
మెట్రో పిల్లర్కు అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ మంటల్లో కాలిపోవడం వల్ల.. దాని లిక్విడ్ పిల్లర్‌పై పడిందని.. అంతే తప్ప మెట్రో పిల్లర్కు ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదని మెట్రో అధికారులు తేల్చి చెప్పారు.
అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న KSR ఫ్యాషన్స్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. హర్ష మెస్ కూడా ఈ అగ్ని ప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అగ్ని ప్రమాదం కారణంగా మైత్రీవనం, అమీర్ పేట్ మెయిన్ రోడ్ దగ్గర దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్లో మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం 14 షాప్లు దగ్ధమయ్యాయి.
