మెట్రో టేక్ ఓవర్ మార్చికల్లా పూర్తి చేయాలి : సీఎస్‌‌ రామకృష్ణారావు

మెట్రో టేక్ ఓవర్ మార్చికల్లా పూర్తి చేయాలి : సీఎస్‌‌ రామకృష్ణారావు
  •     అధికారులకు సీఎస్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తి చేయాలని అధికారులను సీఎస్‌‌ రామకృష్ణారావు ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ  సందర్భంగా ఆయన మెట్రో రైల్‌‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ తాజా పరిస్థితిని సమీక్షించారు. 

ఇరు పక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బదలాయింపు సజావుగా వేగవంతంగా పూర్తి కావాలని సూచించారు. ఈ ప్రక్రియను ఇదివరకటి ఒప్పందాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చేపట్టాలన్నారు. రాబోయే వంద రోజుల్లో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని, టేక్ ఓవర్ ప్రక్రియ పై ఏర్పాటు చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఐడీబీఐ ఈ మేరకు తన రిపోర్టును సిద్ధంచేసి ట్రాన్స్ ఫర్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇందులో ఎల్ అండ్ టీ కూడా పూర్తి సహకారం అందించాలని తెలిపారు.