జోగిపేట, వెలుగు: మంజీర రివర్ కారిడార్ నిర్మాణం కోసం మంగళవారం పార్టీలకతీతంగా నాయకులు జోగిపేటలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. మంజీర నదికి కారిడార్ నిర్మిస్తే జోగిపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైల్వేసాధన సమితి కన్వీనర్ గంగా జోగినాథ్, ట్రేడ్ కార్పొరేషన్మాజీ చైర్మన్ భిక్షపతి, జిల్లా బీజేపీ నాయకులు ప్రభాకర్‌గౌడ్, మాజీ ఎంపీపీ రామాగౌడ్తెలిపారు.
ఈ విషయం గురించి ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చౌటకూర్ మండలంలోని శివ్వంపేట నుంచి మెదక్ ఘన్పూర్ వరకు మంజీర నది పారుతుందన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న రీజినల్ రింగ్‌రోడ్ చౌటకూర్ మండలం నుంచి వెలుతున్నందున ఆ రహదారిని కలిపే సౌలభ్యం ఉంటుందన్నారు.
దీని వల్ల నది పరివాహక గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. హైదరాబాద్‌కు వెళ్లడానికి రవాణా దూరం చాలా తగ్గుతుందన్నారు. ఈ కారణంగా జోగిపేట ప్రాంతంలో ఐటీ డిపార్ట్మెంట్ వంటివి ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయన్నారు. ఈ ప్రాంతంలో యువకులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు.
