నిమ్జ్ భూసేకరణ స్పీడప్ చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య

నిమ్జ్ భూసేకరణ స్పీడప్ చేయాలి : కలెక్టర్  ప్రావీణ్య

    కలెక్టర్  ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: నేషనల్ ఇన్వెస్ట్​మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్), తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీ ఐఐసీ) ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. 

మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ క్యాంపు ఆఫీసులో నిమ్జ్, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ  ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 

నిమ్జ్ ఫేజ్-I పరిధిలో మిగిలి ఉన్న భూముల స్వాధీనం చేసుకొని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్​ఐసీడీసీ)కి అప్పగించాలని సూచించారు. ఫేజ్-Iలో బర్దిపూర్, యెల్గోయి గ్రామాల్లో కొంత భూమి ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ మాధురి, ఆర్డీవో రాజేందర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్, నిమ్జ్ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.