
హైదరాబాద్లోని మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 17.
పోస్టుల సంఖ్య: 50.
పోస్టులు: అసిస్టెంట్– లెవల్ 4(మెటలర్జీ) 20, అసిస్టెంట్– లెవల్ 4(మెకానికల్) 14, అసిస్టెంట్– లెవల్ 4(ఎలక్ట్రికల్) 02, అసిస్టెంట్– లెవల్ 4(కెమికల్) 02, అసిస్టెంట్– లెవల్ 2 (ఫిట్టర్) 04, అసిస్టెంట్– లెవల్ 2(ఎలక్ట్రిషీయన్) 04, అసిస్టెంట్ -– లెవల్ 2(టర్నర్) 02, అసిస్టెంట్–- లెవల్ 2(వెల్డర్) 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: సెప్టెంబర్ 8, 9, 10, 11, 12, 15, 16, 17.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు midhani-india.in వెబ్సైట్లో సంప్రదించగలరు.