గణేష్ లడ్డూ వేలం 51 లక్షలా.. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ మాత్రం ధర ఉంటదిలే..!

గణేష్ లడ్డూ వేలం 51 లక్షలా.. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ మాత్రం ధర ఉంటదిలే..!

హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం సందడి మొదలైంది. నిమజ్జనం ముందు వినాయకుడికి పెట్టిన లడ్డూ ప్రసాదం వేలం వేయటం కామన్. లడ్డూ వేలం అంటే బాలాపూర్.. ఇప్పుడు అన్ని చోట్ల ఇలాంటి వేలం జరుగుతుంది. చివరకు అపార్ట్ మెంట్లలోనూ గణేష్ లడ్డూ వేలం సాగుతుంది. 

హైదరాబాద్ సిటీలోని హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న మైహోం భుజా గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోని లడ్డూ ప్రసాదాన్ని 2025, సెప్టెంబర్ 4వ తేదీ వేలం వేశారు. వేలం ఆసక్తిగా సాగింది. పోటాపోటీగా సాగిన వేలంలో లడ్డూ ప్రసాదం 51 లక్షల 77 వేల 777 రూపాయలు పలికింది. 

మైహోం భుజా గేటెడ్ కమ్యూనిటీలోని గణేష్ లడ్డూ ప్రసాదాన్ని.. 51 లక్షల 77 వేల 777 రూపాయలకు దక్కించుకున్నది ఎవరో తెలుసా.. రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేష్. ఖమ్మం జిల్లా ఇల్లందు వాసి. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత. 

గత సంవత్సరం కూడా లడ్డూ ప్రసాదం వేలం జరిగింది. 2024లో లడ్డూ ప్రసాదం 29 లక్షలకు వేలం ధర పలకగా.. ఈసారి దాదాపు డబుల్ ధర పలికింది.  ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో జరిగిన లడ్డూ ప్రసాదం వేలంలో ఇదే అత్యధిక ధర. మరో రెండు రోజులు ఉండటం.. ఇతర మండపాల్లో లడ్డూ ధర ఎంత పలుకుతుందో చూడాలి.