V6 News

మామూళ్లకు అడ్డు వస్తున్నందుకే మర్డర్

మామూళ్లకు అడ్డు వస్తున్నందుకే మర్డర్
  • హైదరాబాద్ ఓల్డ్ ​సిటీలో హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఓల్డ్​సిటీ, వెలుగు:  హైదరాబాద్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటా ఫుల్ వద్ద ఈనెల 3న రాత్రి జరిగిన షేక్ జునైద్ బిన్ మహమ్మద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.12 మంది నిందితులను గుర్తించారు. ఆరుగురిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ బుధవారం వెల్లడించారు. రెయిన్ ​ బజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇల్లు అమ్మినా, కొన్నా నిందితులు మామూళ్లు వసూలు చేసేవారు. వీరికి షేక్​ జునైద్​ బిన్​ మహమ్మద్​ అడ్డు వస్తున్నాడు. 

దీంతో ఆయనను అడ్డు తొలగించేందుకు హత్యకు పాల్పడ్డారు. అరెస్టయిన వారిలో ఒమర్ బిన్ హమ్జా అల్ జాబ్రీ, అలీ బిన్ హమ్జా అల్ జాబ్రీ, ఫైసల్ బిన్ హబీబ్ మొహమ్మద్, మహ్మద్ మక్సుద్ అలీ, సయ్యద్ అస్గర్ అలీ, మహ్మద్ తాహెర్ ఉన్నారు. మరో ఆరుగురు సయ్యద్ రహీం ఘోరీ షాజిబ్, మాలిక్ బిన్ జావిద్ అల్ జాబ్రి సయ్యద్ జాఫర్ బిన్ ఒమర్, అజార్, జుబైర్, రియాన్, కుల్సుమ్ ను నిందితులుగా గుర్తించారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.