
హైదరాబాద్ సిటీలో బుధవారం వాన కుమ్మేసింది. ఉదయం 11 గంటల వరకు ఎండ ఉన్నప్పటికీ ఆ తరువాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం పడింది. అత్యధికంగా రాత్రి 11 గంటలకు వరకు బండ్లగూడలో 8.88 సెంటిమీటర్లు, అంబర్ పేటలో 8.50, సైదాబాద్ 8.38, సరూర్ నగర్ 8.08, ఉప్పల్ 7.75, హిమాయత్ నగర్ 6.30, చార్మినార్లో 5.85 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనగా.. చిరు వ్యాపారులు, వివిధ పనుల మీద బయటకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు. నగరంలో మరో నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ సిటీని కారు మేఘాలు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. గురువారం ఆసాంతం హైదరాబాద్ సిటీలో వాతావరణం ఇలానే ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
వెలుగు, హైదరాబాద్ సిటీ