హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 3 రూపాయలకు పైగానే పెరిగింది. హైదరాబాద్ సిటీలో లీటర్ పెట్రోల్పై 3.42 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ డీజిల్పై 3.26 రూపాయలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాక.. హైదరాబాద్ సిటీలో లీటర్ పెట్రోల్ ధర 110.88 రూపాయలకు చేరింది. హైదరాబాద్ సిటీలో లీటర్ డీజిల్ ధర 98.96 రూపాయలకు చేరుకుంది.
పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే భారత్ రిటైల్ ఇంధన ధరలను పెంచాల్సి రావచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పిన రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మంగళవారం స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్ బ్యాంక్, ఐఎంఎఫ్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. “పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే, ధరల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేయడం తప్పకపోవచ్చు” అని అన్నారు. సంక్షోభం కొనసాగుతుండటంతో ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ముడి చమురు ధరల పెరుగుదల భారాన్ని భరిస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్పై పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
