V6 News

మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు

మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు
  •     యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ కు సిట్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులు, బాధితుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్  సీపీ సజ్జనార్  ఆధ్వర్యంలోని సిట్ .. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన అనంతరం పలువురి స్టేట్ మెంట్లు నమోదు చేసింది. ఈ క్రమంలోనే యుగ తులసి ఫౌండేషన్  చైర్మన్, టీటీడీ మాజీ సభ్యుడు కె శివకుమార్ కు శనివారం నోటీసులు జారీ చేసింది. 

ఈనెల 28న ఉదయం 11 గంటలకు బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా,  ట్యాపింగ్ లిస్టులో సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా సాక్షుల స్టేట్ మెంట్లు రికార్డు చేస్తున్నారు.