సరైన ఆధారాలు లేవు.. ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరామ్ కు బెయిల్

సరైన ఆధారాలు లేవు.. ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరామ్ కు బెయిల్

తెలంగాణలో ఇటీవల సంచలనం సృష్టించిన విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న శివరామ్ రాథోడ్ ను పోలీసులు.. 2023, అక్టోబర్ 21వ తేదీ శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాంధీ దవాఖానాలో వైద్య పరీక్షలు చేయించి శివరామ్ ను నాంపల్లి కోర్టులో హాజరపర్చారు. ప్రవళిక ఆత్మహత్య కేసులో మా అన్నయ్యకు ఎలాంటి సంబంధం లేదని శివరామ్ సోదరుడు మునిరామ్ రాథోడ్ తెలిపాడు.ఈ కేసులో తమకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులే కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపించాడు.

Also Read : Video Viral: దసరా వేషాలు...అదిరిపోయే విన్యాసాలు

కాగా, ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతోపాటు ప్రవళిక కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పడంతో అలర్ట్ అయిన మంత్రి కెటిఆర్ హుటాహుటిన  ప్రవళిక కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా ప్రగతి భవన్ కు పిలుపించుకుని మాట్టాడారు. ప్రవిళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ఉద్యోగం కూడా ఇస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత శివకుమార్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రవళిక తల్లి, సోదరుడు విడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే.