అమాయకుల పేరుతో బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి రకరకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అమాయకులతో పేరుతో బ్యాంకు కాటాలు ఓపెన్ చేసి..రూ. కోట్లు కొల్లగొట్టిన 8 మంది ముఠాను అరెస్ట్ చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముఠాలోని సభ్యులు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు సమకూరుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
ఎవరో తనను బ్యాంకు అకౌంట్ అడుగుతున్నారని ఓ వ్యక్తి తమను సంప్రదించాడని.. బ్యాంకు అకౌంట్ ఇస్తే.. డబ్బులు ఇస్తామని అంటున్నారని బాధితుడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టి ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు పోలీసులు. నిందితులు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు అకౌంట్లు సమకూరుస్తున్నారని తెలిపారు పోలీసులు.కన్నయ్య అనే రాజస్థాన్ కి చెందిన వ్యక్తి.. హైదరాబాద్ కి చెందిన ఓ ఆటో లో ఎక్కి.. డ్రైవర్ ను మాటల్లో పెట్టి.. బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగాడని తెలిపారు పోలీసులు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తానని.. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి... అందుకు రూ.10 వేలు ఇస్తాను అని డీల్ కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు పోలీసులు.
ఇలా ఇంకా ఎవరైనా అకౌంట్లు తెచ్చిస్తే.. ఇంకా డబ్బులు ఇస్తామని ఆశ చూపడంతో ఆ ఆటో డ్రైవర్.. తన భార్య, బంధువులు, స్నేహితుల ఫోటోలు, గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో వారందరి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసిన కన్నయ్య అందరికి డబ్బులు ఇచ్చాడని తెలిపారు పోలీసులు. ఈ ముఠాకు వీళ్లకు ఓ బ్యాంక్ అధికారి కూడా సహకరించినట్లు తెలిపారు. కన్నయ్య ఈ బ్యాంక్ అకౌంట్ల వివరాలు అన్నీ సైబర్ నేరగాళ్లకు ఇచ్చాడని.. ఇలా 127 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.ఈ రకంగా పలు సైబర్ నేరాలకు పాల్పడిన ముఠా.. ఈ అకౌంట్లకు డబ్బు మళ్ళించారని తెలిపారు పోలీసులు.
సైబర్ నేరగాళ్లు ఇలా రూ. 24 కోట్ల కొల్లగొట్టారని.. ఇందులో 23.9 కోట్లు విత్ డ్రా చేశారని తెలిపారు పోలీసులు. నిందితుల నుంచి 11 పాస్ బుక్ లు, 14 ఏటీఎం కార్డులు, బయో మెట్రిక్ డివైజ్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముఠాలో కీలక సభ్యులైన రాజస్థాన్ కి చెందిన కన్నయ్య, రమేష్, పూనమ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఆటో డ్రైవర్లు పూజారి జగదీష్, సునీల్ కుమార్, మణిదీప్, బ్లూ డార్ట్ డెలివరీ బాయ్ నిఖిల్, హార్డ్వేర్ టెక్నీషియన్ బాలు, ఫోటోగ్రాఫర్ బత్తుల పవన్, ప్రవీణ్, బాలాజీ నాయక్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
