గంజాయితో ‘బంగ్’ గోళీలు... చూడీబజార్ లో ఇద్దరు అరెస్ట్

గంజాయితో ‘బంగ్’ గోళీలు... చూడీబజార్ లో ఇద్దరు అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: గంజాయి అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో కొందరు అక్రమార్కులు కొత్త దారులకు తెరతీస్తున్నారు. గంజాయిని రుబ్బి ‘బంగ్’ పేరుతో గోళీలు, చాక్లెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు గుర్తించారు. 

చూడీబజార్ శంకర్ బజార్ ప్రాంతంలోని యూపీకి చెందిన లవకుశ్ శర్మ ఇంట్లో సోదాలు నిర్వహించి, 1.30 కేజీల బంగ్ గోళీలను, 200 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. లవకుశ్ శర్మతో పాటు భాను ప్రతాప్​ను  అరెస్ట్ చేసినట్లు ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు.