అంబర్‌పేట, వెలుగు: ఆన్‌లైన్ ద్వారా నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 22 బాబిన్ల దారం స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ టి.కిరణ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. శంకర్‌నగర్‌కు చెందిన భూషెట్టి నిఖిల్(19) తన ఇంట్లో నిషేధిత చైనా మాంజాను అక్రమంగా నిల్వ చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు.
బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించి నిఖిల్‌ను అరెస్టు చేశారు. రూ.22 వేల విలువైన దారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఖిల్ అనే మరో యువకుడితో కలిసి దారం అమ్ముతున్నట్లు విచారణలో తేలడంతో ఆయనను కూడా అరెస్ట్ చేశారు.
