హైదరాబాద్ లో డ్రగ్స్ కి బానిసైన లేడీ డాక్టర్.. ఏకంగా రూ. 70 లక్షల డ్రగ్స్ తీసుకుందంట..

హైదరాబాద్ లో డ్రగ్స్ కి బానిసైన లేడీ డాక్టర్.. ఏకంగా రూ. 70 లక్షల డ్రగ్స్ తీసుకుందంట..

ఆమె డాక్టర్.. ఆషామాషీ డాక్టర్ ఏమీ కాదు.. హైదరాబాద్ సిటీలోనే ఓ పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న ప్రముఖ మహిళా డాక్టర్. డాక్టర్ గా ఎంతో బాగా పని చేస్తూ.. చాలా బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఇలాంటి డాక్టర్ డ్రగ్స్ కు బానిస అయ్యారు. డ్రగ్స్ కోసం తపించేస్తున్నారు. ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు డ్రగ్స్ కోసం ఖర్చు చేయటమే కాదు.. 70 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తీసుకున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. హైదరాబాద్ సిటీలోనే సంచలనంగా మారిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

డాక్టర్ నమ్రత.. వయస్సు 34 ఏళ్లు. ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపించి.. ముంబై నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ తెప్పిస్తున్నారు. 5 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ను.. లేడీ డాక్టర్ నమ్రత హైదరాబాద్ సిటీలో డెలివరీ బాయ్ ద్వారా తీసుకుంటుండగా.. రాయదుర్గం పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరి నుంచి రూ. 5 లక్షల విలువైన 53 గ్రాముల కొకైన్ డ్రగ్స్, రూ. 10 వేలు నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

ఈ క్రమంలో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.. డాక్టర్ గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్ కు బానిసగా మారి ఇప్పటివరకు 70 లక్షల రూపాయల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వతహాగా డాక్టర్ అయ్యుండి నమ్రతా ఇంతలా డ్రగ్స్ కి బానిసవ్వడం పట్ల పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.